Arimilli Radhakrishna: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. పది రోజుల క్రితమే ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు బాండ్ల విషయం తనకు చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని.. మరోవైపు మంత్రికి నిన్నే చెప్పానని ఎమ్మెల్యే అంటున్నారని అన్నారు. వీరిద్దరి మాటల మధ్య స్పష్టత లేదని అన్నారు.
Arimilli Radhakrishna: టీడీఆర్ బాండ్లు పొందినవారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆరిమిల్లి ఖండించారు. బాండ్లు పొందినవారిలో కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉంటే వారందరూ తెలుగుదేశం సానుభూతిపరులా? అని ప్రశ్నించారు.