ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు పేదల నుంచి దండుకుంటున్నారు' - వైసీపీపై పితాని సత్యనారాయణ విమర్శలు

తెదేపాలో కీలకమైన నేతలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. విజిలెన్స్ నివేదికలో ఏంలేకపోయినా అచ్చెన్నాయుడిని అనిశా వేధిస్తోందన్నారు. ఈఎస్​ఐ వ్యవహారంలో కావాలనే అచ్చెన్నాయుడిని ఇరికించారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా వసూళ్ల పర్వం మొదలుపెట్టిందన్నారు. వైకాపా నేతలు ఇళ్ల పట్టాల పేరుతో పేదల వద్ద నుంచి డబ్బు దండుకుంటున్నారని మండిపడ్డారు.

పితాని సత్యనారాయణ
పితాని సత్యనారాయణ

By

Published : Jun 26, 2020, 9:25 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తెదేపా ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని.. కేసుల పేరుతో వేధిస్తోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడిన ఆయన.... ఈఎస్ఐ వ్యవహారంలో కావాలనే అచ్చెన్నాయుడిని ఇరికించారన్నారు. విజిలెన్స్ నివేదికలో ఏమీ లేకపోయినా.. ఏసీబీ కేసుల పేరుతో వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టాల పంపిణీలో అక్రమాలు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న ఇళ్లపట్టాల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని పితాని ఆరోపించారు. ఆచంట నియోజకవర్గంలో ఇళ్లపట్టాల పంపిణీ పేరుతో వైకాపా నాయకులు పేదల నుంచి రూ.20 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో దండుకుంటున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి..

పరుగుల్లేని ప్రగతి రథ చక్రం... నష్టాల బాటలోనే పయనం...

ABOUT THE AUTHOR

...view details