ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

25వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి - 25th National Kabaddi Competition news

శ్రీ గోగులమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ జాతీయస్థాయి స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ముప్పై సంవత్సరాలుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

Former minister Kottapalli Subbarayudu
25వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

By

Published : Jan 15, 2021, 10:26 AM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ గోగులమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ జాతీయస్థాయి స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. ముప్పై సంవత్సరాలుగా పోటీలు నిర్వహిస్తున్నామని.. ఇక్కడ ఆడిన క్రీడాకారులు ఎందరో జాతీయ, అంతర్జాతీయంగా రాణించారన్నారు. గెలుపోటములను ఆటగాళ్లు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతీయ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి 30 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఎస్పీ వీరంజనేయరెడ్డి పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాలుగా పోటీలను నిర్వహించటంపై ఉత్సవ కమిటీని అభినందించారు.

ఇదీ చదవండి:గోదావరి జిల్లాల్లో.... కోడిపందేలు జోరుగా

ABOUT THE AUTHOR

...view details