గుండెపోటుతో మృతి చెందిన అటవీ అధికారి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అటవీశాఖ రేంజ్ అధికారి తెన్నలూరి శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికల్ లీవు తీసుకున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఏలూరు అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. గత రాత్రి నుంచి గది నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన అక్కడ సిబ్బంది తలుపులు పగలకొట్టి చూడగా విగత జీవిగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: