ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టినరోజు నాడే యువతి బలవన్మరణం - Forced death of an young woman on her birthday

మనస్తాపానికి గురైన ఓ యువతి తన పుట్టిన రోజు నాడే బలవన్మరణానికి పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఈ ఘటన జరిగింది.

Forced death of an young woman on her birthday
పుట్టినరోజు నాడే యువతి బలవన్మరణం

By

Published : Aug 13, 2020, 9:28 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని కాకర్లవారి వీధిలో నివసిస్తున్న సోము ఈశ్వరి నాగ రామలక్ష్మి (32) అనే అవివాహిత పుట్టిన రోజు నాడే బలవన్మరణానికి పాల్పడింది. గురువారం ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పైపు కోసి.. గ్యాస్ లీక్ చేసుకుని నిప్పు అంటించుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లోంచి మంటలు రావడం గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టారు. అప్పటికే రామలక్ష్మి పూర్తిగా కాలిపోయి మృతి చెంది కనిపించింది.

రామలక్ష్మికి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ఆమె పుట్టిన రోజునాడే ఈ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వీరభద్రరావు, అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ కుమార్ పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details