రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంఐకాసవిన్నూత్న నిరసనకు దిగింది. సంక్రాంతి పురస్కరించుకుని గంగిరెద్దులు, హరిదాసులు, సన్నాయి మేళాలతో అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టింది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేసింది. ఈ ధర్నాలో తెదేపా నాయకులు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, న్యాయవాదులు, వైద్యులు పాల్గొన్నారు.
అమరావతి కోసం గంగిరెద్దులతో నిరసన - latest amaravathi news in ap
నరసాపురం అంబేడ్కర్ కూడలిలో రాజధాని అమరావతి కోసం ఐకాస వినూత్న నిరసన చేపట్టింది. గంగిరెద్దులు, హరిదాసులు, సన్నాయి మేళాలతో ఆందోళన చేసింది.
అమరావతి కోసం... గంగిరెద్దులు,హరిదాసులు, మేళాలతో నిరసన