పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మాంసం కూర తిని... అది వికటించినకారణంగాతల్లి, కుమారుడు మృతి చెందారు. బోడిగూడేనికి చెందిన మర్రి వెంకటేష్ కు భార్య ప్రేమకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజులు క్రితంగోంగూర, మాంసం కలిపి వండుకుని ఇంటిల్లిపాది తిన్నారు. అనంతరం గంటకు వాంతులు చేసుకున్నారు. వెంటనే కొయ్యలగూడెం ప్రైవేటు ఆసుపత్రికి బాధితులను వారి బంధువులుతరలించారు. పరిస్థితి విషమించటంతో రాజమహేంద్రవరం తరలించారు.చికిత్స పొందుతూ గురువారం కుమారుడు ప్రవీణ్ మృతి చెందగా, శుక్రవారం ప్రేమకుమారి చనిపోయింది.కొయ్యలగూడెం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.