పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద వలసకూలీలకు... ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఆహారం, చెప్పులు పంపిణీ చేశారు. లారీలు, బస్సుల్లో వస్తున్న కూలీలను యోగక్షేమాలు తెలుసుకున్నారు.
వారికి తాగునీరు అందించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని... ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పోలీసులు, వైద్యులు చేస్తున్న సేవలకు ప్రజలు రుణపడి ఉంటారన్నారు.