పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై అడ్డుకట్ట వేయడంతో నీరు అప్రోచ్ ఛానల్లోకి మరలుతోంది. పది రివర్ స్లూయిజ్, 13 క్రస్టుల నుంచి 20,500 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే వద్ద నీటిమట్టం క్రస్టు లెవల్ (25.72 మీటర్లు) దాటి ప్రవహిస్తున్నట్లు ఈఈ ఆదిరెడ్డి తెలిపారు.
polavaram: భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం..అప్రోచ్ ఛానల్లోకి నీరు - పోలవరం తాజా వార్తలు
గోదావరి పరిహహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై అడ్డుకట్ట వేయడంతో నీరు అప్రోచ్ ఛానల్లోకి మళ్లుతోంది.
పోలవరం ప్రాజెక్టులో భారీగా చేరుతున్న వరద నీరు