పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్దున్న భారీ వర్షాలకు వరదలు పొంగి పొర్లుతున్నాయి. దెందులూరు మండలంలోని సత్యనారాయణ పురం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. గ్రామం చుట్టూ ఉన్న పొలాలు ముంపునకు గురయ్యాయి. గుండెరు ద్వారా వచ్చిన వరద నీరు దశలవారిగా పెరిగి మంగళవారం అర్థరాత్రి గ్రామాన్ని చుట్టేసింది. గ్రామంలో ప్రదాన రహదారిపై మోకాలు లోతు నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 500 ఎకరాల్లో పంట నీట మునిగింది.
గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు - west godavari latest news
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. గ్రామం చుట్టు పొలాలు ముంపునకు గురయ్యాయి.
గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు