పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పోలవరం మండలం పైడిపాక వద్ద గట్టుకు గండి పడటంతో వరదనీరు స్పిల్ వే వైపు మళ్లింది. స్పిల్ వేలోకి భారీగా నీరు రావటంతో ప్రాజెక్ట్ పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. స్పిల్ వేలో ఉన్న యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద 27.150 మీటర్ల నీటిమట్టం ఉండగా.. పోలవరం వద్ద 12.470 మీటర్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే భద్రాచలంలో 44 మీటర్లకు వరద నీరు చేరుకుంది.
పోలవరానికి వరద తాకిడి.. ప్రాజెక్టు పనులు నిలిపివేత - పోలవరానికి వరద తాకిడి వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద నీరు చేరటంతో ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద 27.150 మీటర్ల నీటిమట్టం ఉండగా.. పోలవరం వద్ద 12.470 మీటర్లకు వరదనీరు చేరుకుంది.
పోలవరం ప్రాజెక్టు వద్ద వరదనీరు