ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై వరదనీరు.. కనుచూపు మేరలో కనిపించని రోడ్డు - Flood on National Highway in West Godavari district

పశ్చిమగోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గుండేరు వాగులో నీటి ఉద్ధృతి అధికం కావటంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

flood water
జాతీయ రహదారిపై వరదనీరు

By

Published : Sep 28, 2021, 4:50 PM IST

కుండపోత వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. గుండేరు వాగుకు పది వేల క్యూసెక్కుల వరద రావడంతో దెందులూరు సమీపంలోని 16 నెంబరు జాతీయ రహదారిపైకి నీరు చేరింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వరదనీరు వెళుతోంది. జిల్లాలో జలశయాల నుంచి వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో లోతట్టు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలో వరదల పరిస్థితిపై మా ప్రతినిధి రాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు.

జాతీయ రహదారిపై వరదనీరు

ABOUT THE AUTHOR

...view details