పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. ఇటీవల వచ్చిన వరదల నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తెరుకోక ముందే.. మళ్ళీ వరద పెరగడంతో పోలవరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తూరు కాజ్ వే పైకి వరద నీరు 10 అడుగులు చేరుకోవడంతో నాటు పడవలను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసి ప్రజలను దాటిస్తున్నారు. కాపర్ డ్యామ్ వద్ద 24.547 మీటర్లు, పోలవరంలో 21.247 మీటర్లు వరద ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలవరం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం - పోలవరంలో వరద ఉద్ధృతి
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తూరు కాజ్ వే పైకి వరద నీరు 10 అడుగులు చేరుకున్నాయి. పడవలతో ప్రజలను అధికారులు తరలిస్తున్నారు.
పోలవరం వద్ద పెరిగిన గోదవరి నీటిమట్టం