ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండిన చేపల చెరువులు - fish farmers latest news in west godavari

చేపల చెరువులకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు నెలలుగా నీటిచుక్క రాని కారణంగా చాలా చెరువుల్లో నీరు తగ్గి పోయింది. ఫలితంగా లక్షల రూపాయలు లీజులు కట్టిన రైతులు సాగు నీరు అందక నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చేపల చెరువుల రైతుల కష్టాలు
చేపల చెరువుల రైతుల కష్టాలు

By

Published : Apr 19, 2020, 12:33 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని చేపల చెరువుల రైతులు తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారు. గత ఐదు నెలలుగా చెరువులకు సాగునీరు అందక ఆందోళనకు గురవుతున్నారు. పంట కాలువ వెంబడి వచ్చే అరకొర నీటిని ఎగువ భాగంలో ఉన్న రైతులు నీరు తోడుకున్న కారణంగా.. దిగువ భాగానికి నీళ్లు అందడం లేదు. ఫలితంగా దిగువ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మండలంలోని పోతునూరు, దోసపాడు, కొవ్వలి తదితర గ్రామాలతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ నీటి సరఫరా విషయంలో చేపల చెరువుల రైతులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details