పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బజాజ్ షోరూం పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద తృటిలో అగ్ని ప్రమాదం తప్పింది. బంకు సమీపంలోని డ్రైనేజీలో పడేసిన ఆయిల్ గుడ్డలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పెట్రోల్ బంక్ వైపు వ్యాపించాయి. సమీపంలో ఉన్న స్థానికులు..,పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. డ్రెయిన్లో ఆయిల్ తడిసిన బట్టలు వేయటం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
పెట్రోల్ బంకు సమీపంలో మంటలు... తృటిలో తప్పిన ప్రమాదం - పశ్చిమగోదావరిలో పెట్రోల్ బంకు సమీపంలో మంటలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బజాజ్ షోరూం పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద తృటిలో అగ్ని ప్రమాదం తప్పింది. బంకు సమీపంలోని డ్రైయిన్లో ఆయిల్ తడిసిన గడ్డులకు నిప్పంటుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పెట్రోల్ బంకు సమీపంలో మంటలు