ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకులో అగ్నిప్రమాదం.. రూ.6 లక్షల మేర నష్టం - కోపల్లె యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా కోపల్లెలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, సామగ్రి కాలిపోయి.. సుమారు రూ. 6 లక్షల నష్టం జరిగినట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు.

fire accident in union bank of india at kopalle west godavari district
అగ్నిప్రమాదంలో కాలిపోయిన కంప్యూటర్లు

By

Published : Aug 29, 2020, 5:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపల్లెలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్​తో ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్తున్నారు. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సూమరు రూ. 6 లక్షల మేర నష్టం జరిగినట్లు బ్యాంకు మేనేజర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం బ్యాంకు తెరిచే సమయంలో లోపలనుంచి పొగలు వస్తుండటంతో అలారం మోగింది. అప్రమత్తమైన ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా వారు మంటలను అదుపుచేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details