ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fire Accident: బ్యాంకులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన క్యాష్‌కౌంటర్‌, గోల్డ్ కౌంటర్ - చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకు అగ్నిప్రమాదం తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో.. క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి.

fire accident in union bank at chinnayagudem in west godavari
బ్యాంకులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన క్యాష్‌కౌంటర్‌, గోల్డ్ కౌంటర్

By

Published : Oct 12, 2021, 12:15 PM IST

చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకు అగ్నిప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకు(union bank)లో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ ప్రమాదంలో క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details