పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులోని సింగరాజుపాలెం వెళ్లే రహదారి పక్కన ఆర్నవ్ పాలిమర్స్ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. ముడిసరుకుకు అంటుకున్న మంటలు ఒక్కసారిగా పరిశ్రమ అంతా వ్యాపించాయి. ఇటీవల కొత్తగా బిగించిన యంత్రాలు, ముడిసరుకు షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఉంగుటూరు థర్మకోల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. రూ.5 కోట్ల ఆస్తి నష్టం - west godavari latest news
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులోని థర్మకోల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉంగుటూరు థర్మకోల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
తాడేపల్లిగూడెం, భీమడోలు అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమను జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు, సహాయ అధికారి పిఎస్ నాయుడు పరిశీలించారు.
ఇదీ చదవండి.