ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నల్లమాడు సంచుల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా నల్లమాడులోని లక్ష్మీకృష్ణ పాలిమర్స్​ పరిశ్రమలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ వల్ల మంటలు వ్యాపించాయని నిర్వాహకులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నల్లమాడు సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
నల్లమాడు సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Oct 4, 2020, 4:40 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలోని ఓ పరిశ్రమలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చేబ్రోలు గ్రామానికి చెందిన దాసరి తరుణ్ కుమార్ నల్లమాడు గ్రామంలో లక్ష్మీ కృష్ణ పాలిమర్స్ పేరిట సంచులు తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయని నిర్వాహకులు అంటున్నారు.

సంచుల పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంచుల పరిశ్రమ కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తించాయి. సమాచారం అందుకున్న భీమడోలు, తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసే ప్రయత్నంచేశారు. ఈ ప్రమాదంలో పరిశ్రమలోని యంత్రాలు, ముడిసరకు పూర్తిగా దగ్ధమయ్యిందని నిర్వాహకులు అంటున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి :సోమవారం దిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ABOUT THE AUTHOR

...view details