తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలోని ఓ సైకిల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. సుమారు రూ .15 లక్షల వరకూ ఆస్తినష్టం జరిగిందని దుకాణ యజమాని వాపోతున్నాడు.
FIRE ACCIDENT: సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం..రూ. 15 లక్షల ఆస్తి నష్టం! - ఏపీలోని సైకిల్ దుకాణంలో అగ్నిప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలోని ఓ సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు.
సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం.. 15 లక్షల ఆస్తి నష్టం