ఇదీ చదవండి:
పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం - పట్టిసీమ పథకం వద్ద అగ్నిప్రమాదం న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న విద్యుత్ సరఫరా కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వచ్చి.. కాసేపట్లో ఎక్కువయ్యాయి. ఈ ఘటనతో పరిసర గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం