పశ్చిమగోదావరి జిల్లా రేలంగిలో జనవరి 9వ తేదీన వైకాపా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో మహిళలు కూర్చున్న టెంట్‌పై కొబ్బరి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అందించారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో కొబ్బరి చెట్టు విరిగి పడిన ఘటనలో బాధిత కుటుంబాలకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ.23 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
తణుకులోమృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
రాజకీయాలకతీతంగా పేద ప్రజలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.
వేగంగా మహమ్మారి వ్యాప్తి.. ఒక్కరోజే 1,288 కరోనా కేసులు, 5 మరణాలు
TAGGED:
తణుకు నేటి వార్తలు