ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ప్రముఖ సినీ కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్ని తణుకు పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో సినిమా థియేటర్​లో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

film actore mla balakrishna birthday
తణుకులో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

By

Published : Jun 10, 2020, 3:50 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని కేక్ ​కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, ప్రజా ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి జనం మనసులు గెలుచుకున్నారని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details