ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఐదో విడత రేషన్ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 29 నుంచి ఒక్కో సభ్యునికి 5 కిలోల బియ్యం, ఒక్కో కార్డుకి కిలో కందిపప్పు ఇవ్వనున్నారు. కార్డుదారులు నుంచి వేలిముద్రలు సేకరించిన తర్వాత మాత్రమే సరుకులు సరఫరా చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలలో రేషన్ కార్డు దారుల ఇళ్ల వద్దకే డీలర్లు లేదా వాలంటీర్లు వెళ్లి సరుకులు అందజేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఐదో విడత రేషన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు - ఐదో విడత రేషన్ పంపిణీ తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఐదోసారి ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 29వ తేదీన రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా రేషన్ ఇవ్వనున్నారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజల ఆకలి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకం కింద ఐదో విడత రేషన్ పంపిణీ చేయనున్నారు.
ఐదో విడత రేషన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు