Fevers are Rampant in West Godavari District:రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్నా జ్వరమొచ్చింది..! అనే మాటే వినబడుతోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు.. అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌తో సతమతమయిన ప్రజలు.. డెంగీ, మలేరియా, ఫ్లూ జ్వరాల విజృంభణతో అల్లాడిపోతున్నారు. జ్వరం తీవ్రత తట్టుకోలేక బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
Fevers are Spreading in Narasapuram Mandal:ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో జ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా చేయకపోవడం, వర్షపు నీరు ఇళ్ల మధ్యలో రోజులు తరపడి నిల్వ ఉండటంతో.. ఆనారోగ్యం బారిన పడుతున్నామని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నంచినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో పలువురు డెంగ్యూ బారిన పడినట్లు స్థానికులు వెల్లడించారు.
Booming poisonous fevers : విజృంభిస్తున్న విష జ్వరాలు
Local Doctors who Set up Camps in Villages: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విస్తరిస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైద్యులు.. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. చెత్త సేకరణ నెలకు రెండు, మూడు సార్లు మించి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల నుంచి జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి.. రహదారి పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి.. మురుగు నీరు బయటకు వెళ్లేందుకు తాత్కాలిక డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.