ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో మునిగి కొడుకు... కాపాడబోయి తండ్రి...! - పశ్చిమ గోదావరిలో తండ్రీకొడుకు మృతి

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో... తండ్రీకొడుకులు మృతిచెందారు. చెరువులో పడిన కొడుకును కాపాడబోయి తండ్రీ మునిగిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు.

పశ్చిమ గోదావరిలో తండ్రీకొడుకు మృతి

By

Published : Nov 22, 2019, 7:28 PM IST

చెరువులో మునిగి కొడుకు... కాపాడబోయి తండ్రి...!

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో విషాదం జరిగింది. తండ్రీకొడుకు చెరువులో మునిగి మృతిచెందారు. తాటిఆకులగూడెం గ్రామానికి చెందిన కేసుబోయిన కృష్ణ చిన్న కుమారుడు దుర్గాప్రసాద్... పొలం పక్కనే ఉన్న చెరువులో మునిగిపోయాడు. ఇది గమనించిన తండ్రి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు చనిపోయారు. సాయంత్రమయినా ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు వెతికారు. చెరువులో తండ్రి మృతదేహం కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details