ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"డబ్బులు పంపిస్తావా.... బిడ్డలను చంపేయమంటావా!" - godavari harrasement news

చెడు అలవాట్లకు బానిసైన ఓ తండ్రి.. డబ్బు కోసం కుమార్తెలపైనే దాడికి పాల్పడ్డాడు. పిల్లల పోషణకు గల్ఫ్‌లో ఉన్న భార్య డబ్బు పంపించకపోవటంతో చిన్నారులపై తన ప్రతాపాన్ని చూపాడు. పైగా ఆ దృశ్యాలను చిత్రీకరించి భార్యకు పంపించడమే కాకుండా డబ్బులు పంపిస్తావా లేదా బిడ్డలను చంపేయమంటావా అని బెదిరింపులకు దిగాడు.

భార్యపై కోపం ... పిల్లలపై ప్రతీకారం

By

Published : Nov 12, 2019, 2:10 PM IST

Updated : Nov 13, 2019, 4:42 AM IST

భార్యపై కోపం ... పిల్లలపై ప్రతీకారం

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిఆ బాధ్యత మరిచాడు.చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు. తన జల్సాలకు జీవనోపాధి కోసం గల్ఫ్‌లో ఉన్న భార్య డబ్బులు పంపడంలేదనిచిన్నారులను చిత్రహింసలకు గురిచేశాడు.ఈ దారుణ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మధ్య సారవలో జరిగింది.పాలకొల్లు మండలం పెనుమాదం గ్రామానికి చెందిన మహాలక్ష్మిమధ్యసారవకు చెందిన ఎలీషాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వివాహమైన దగ్గరనుంచే భార్యను వేధించడం మొదలుపెట్టాడు.ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎలీషాలో మార్పురాలేదు.దీంతో పూట గడవడం కష్టంగా మారటంతోమహాలక్ష్మిఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లింది.పిల్లల పోషణ కోసం నెలనెల కొంత మొత్తాన్ని పంపించేది.అయితే ఎలీషా ఆ సొమ్ముతో జల్సాలు చేసుకునేవాడు.ఈ విషయం గమనించిన మహాలక్ష్మి కొంత కాలంగా డబ్బులు పంపించడం ఆపేసింది.ఆగ్రహించిన ఎలీషా ఇద్దరు చిన్నారులను బెల్టుతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు.పైగా ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించి గల్ఫ్‌లో ఉన్న తన భార్యకు పంపించాడు."డబ్బులు పంపిస్తావా..లేక పిల్లలను చంపమంటావా" అని బెదిరింపులకు దిగాడు. ఎలీషా సోదరి కూడా చిన్నారులను చిత్రహింసలు పెట్టింది.

భర్త నుంచి పిల్లలను కాపాడుకోవాలనుకున్న మహాలక్ష్మి..ఎలీషా పంపించిన వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులకు పోస్టు చేసి సాయాన్ని అర్థించింది.వారు పోలీసులను ఆశ్రయించటంతో శాడిస్ట్ తండ్రి ఎలీషాను నరసాపురం డీఎస్పీఅరెస్టు చేశారు.చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి,తల్లితో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడించారు.మంత్రి తానేటి వనిత చిన్నారులను పరామర్శించారు.వారిపై దాడికి పాల్పడ్డ తండ్రి,మేనత్తపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

Last Updated : Nov 13, 2019, 4:42 AM IST

ABOUT THE AUTHOR

...view details