ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'13 ఏళ్లుగా పని చేస్తున్నాం.. తొలగించడం భావ్యమా!' - విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్

ఏలూరులో ఫసల్ బీమా యోజనలో 13ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రాథమిక కార్యకర్తలను తొలగించటంతో వాళ్లు నిరసన చేపట్టారు. వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు.

fasal bima yojana employees protest
13ఏళ్లుగా పనిచేస్తున్నాం.. తొలగించడం భావ్యమా!

By

Published : Nov 9, 2020, 4:13 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఫసల్ బీమా యోజనలో విధులు నిర్వహిస్తున్న ప్రాథమిక కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. గ్రామ సచివాలయాల్లో 13ఏళ్లుగా పని చేస్తున్న తమను తొలగించి.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details