Farms are cracked: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గోదావరి కాలువ పరిధిలోని దెందులూరు నియోజకవర్గంలో మల్కాపురం ప్రాంతంలో సాగు నీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. రబీ ప్రారంభంలో పుష్కలంగా సాగునీటిని అందిస్తామని చెప్పిన అధికారులు.. బీటలు వారుతున్నా పొలాలను వచ్చి చూడకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతులు.. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.
Farms are cracked: గోదావరి ఏలూరు కాలువ పరిధిలోని మాల్కాపురం మూడో నెంబర్ తూము పరిధిలో ఉన్న పొలాలకు 20 రోజులుగా సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. ఐదు రోజులు వంతు అని చెబుతున్న అధికారులు.. 24 గంటల్లోనే కాలువలో నీరు లేకుండా చేస్తున్నారని, పొలాలకు సాగునీరు ఎలా అందుతుందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. సకాలంలో సాగునీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని, ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.