కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కూరగాయలు రోడ్డుపై పోసి.. నినాదాలుచేశారు. ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి ఆటోలో కూరగాయల సంచులు తెచ్చి.. ఉచితంగా పంచిపెట్టారు. కిలో రెండు, మూడు రూపాయలకు ఇవ్వడం కంటే ఉచితంగా ఇవ్వడం మేలని పంపిణీ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. కూరగాయల రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. లాక్ డౌన్ వల్ల అన్నిరకాల కూరగాయలకు ధరలు లేవని ఆందోళన చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
రోడ్డుపై కూరగాయలు పోసి నిరసన తెలిపిన రైతులు - ఏలూరులో రైతుల ధర్నా
పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదంటూ రైతులు రోడ్డెక్కారు. కూరగాయలు రహదారిపై పోసి నినాదాలు చేశారు. రెండు, మూడు రూపాయలకు అమ్మడం కంటే ఉచితంగా పంచిపెట్టడం మేలని ప్రజలకు కూరగాయలను ఉచితంగా ఇచ్చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
farmers protest news