'2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే' - farmers protest at west godavari latest news update
2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలంటూ కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలం రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులు ఈ మేరకు ఆందోళన చేపట్టారు.
గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు
పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఎకరాకు రూ.40 లక్షలు ధర వచ్చే భూములకు ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రం ఇస్తామనడం దారుణమన్నారు. పోలీసులతో అరెస్టులు చేయించి బలవంతపు భూసేకరణ చేపడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు.