పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో.. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును రైతులు అడ్డుకున్నారు. ధాన్యం సరఫరా చేసి రెండు నెలలు గడుస్తున్నా.. సొమ్ములు చెల్లించలేదని అన్నదాతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతుల దీక్షకు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును రైతులు అడ్డుకున్నారు. ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి 4 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని.. రైతులు చేస్తున్న దీక్షకు భాజపా ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జనసేన పార్టీ సమాధానం చెప్పాలని అన్నారు. నిధులు విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.
ఎమ్మెల్యే కారును అడ్డుకున్న రైతులు.. ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ - farmers protest at west godavari
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తాము సరఫరా చేసిన ధాన్యానికి సొమ్ములు చెల్లించాలని కోరుతూ ఆందోళన చేశారు. ధాన్యం సరఫరా చేసి రెండు నెలలకు పైగా గడుస్తున్నా సొమ్ములు చెల్లించకపోవడం పట్ల నిరసనగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును రైతులు అడ్డుకున్నారు.
farmers protest for paddy money at duvva west godavari district