పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి.. ఇప్పటికీ సొమ్ము చెల్లింపు జరగలేదంటూ ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా.. రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులతో ధర్నా విరమింపజేశారు.
ధాన్యం అమ్మిన సొమ్ము చెల్లించాలంటూ రైతుల రాస్తారోకో - tanuku
పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. ధాన్యం అమ్మగా రావాల్సిన సొమ్మును చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ.. దువ్వ సమీపంలోని జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
ధాన్యం అమ్మిన సొమ్ము చెల్లించాలని రైతుల రాస్తారోకో