ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ అన్నదాతల ఆందోళన - protest at elurur

ఏలూరు కలెక్టరేట్​ వద్ద అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా, అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తమను బకాయి సొమ్ములు చెల్లించకుండా ప్రభుత్వం వేధించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers protest at eluru Collectorate to demand release grain dues
ఏలూరు కలెక్టరేట్​ వద్ద అన్నదాతలు ఆందోళన

By

Published : Jun 14, 2021, 5:36 PM IST

ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం - ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బకాయిలు విడుదల చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని నినాదాలు చేశారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా రైతులకు, కౌలు రైతులకు బకాయి సొమ్ములు ఇవ్వకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. కరోనా కష్టాలు, అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై రైతు భరోసా కేంద్రాలు వద్ద ఆందోళన చేపట్టి... వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించలేదని రైతులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details