ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోనె సంచులు ఇవ్వండి.. ధాన్యం కొనుగోలు చేయండి! - బాపిరాజు గూడెంలో రైతులు ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం బాపిరాజు గూడెంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కోనుగోలు చేయాలని.. తమను ఆదుకోవాలని కోరారు.

farmers protest at dendulur
రైతుల ధర్నా

By

Published : May 11, 2021, 4:46 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బాపిరాజు గూడెంలో రైతులు ధర్నా నిర్వహించారు. గోనె సంచులు ఇవ్వండి.. ధాన్యం కొనుగోలు చేయండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. కల్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో కొనే పరిస్థితి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

వరి కొనకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నదాతలు విమర్శించారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొప్పన వెంకటేశ్వరరావు, చల్లగుళ్ల రామ్మోహన్ రావు, బొల్లిన రంగారావు, బొప్పన మార్కండేయులు, మల్లాది రామారావు, జి. గురవయ్య, వెలివెల శివయ్య, జొన్నగిరి గంగగారావు, నారాయణ, బోట్ల గోపి, మానికల సర్వేశ్వరరావు, బోట్ల పుల్లారావు, గురజాల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details