పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్లపూడి, బుట్టాయి గూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తాళ్లపూడి మండలంలో ఈదురు గాలులకు సుమారు 20 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. బల్లిపాడులో శివాలయం ధ్వజ స్తంభం విరిగిపడింది.
పిడిగుపాటుకు గొర్రెలు మృతి..
జంగారెడ్డి గూడెం మండలం దేవరపల్లిలో పిడుగుపడి 15 గొర్రెలు మృతి చెందాయి. పొలం నుంచి ఇంటికి గొర్రెలు తోలుకువస్తుండగా పిడుగుపడి మృతి చెందినట్లు రైతు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక ప్రభుత్వాధికారులు తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
ఇదీ చదవండి:తిరుపతి ఉప ఎన్నిక: నారా లోకేశ్ విస్తృత ప్రచారం