పశ్చిమ గోదావరి జిల్లాలో అరటి రైతులు నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట లాక్ డౌన్ వల్ల అక్కరకు రానంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టామని... తీరా పంట చేతికి అందేసరికి.. నోటికి అందకుండా పోయిందని బోరుమంటున్నారు. మరికొంతమంది రైతులు వదిలేయలేక వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. లాక్ డౌన్ తో వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు దెబ్బతిని అరటి రైతులు నష్టాల పాలవుతున్నారు.
అరటి అక్కరకు రానంటోంది: రైతన్న ఆవేదన - అరటి రైతుల ఇక్కట్లు
లాక్‌డౌన్ ప్రభావం రైతుల మీద పడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రైతులు వచ్చిన ధరకే పంటను విక్రయిస్తున్నారు.
farmers-problems-in-west-godavari