డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2020 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన పశ్చిమగోదావరి జిల్లా రైతులకు పరిహారం లభించనుంది. ఈ పథకం కింద రైతులకు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం నేడు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. 2020 ఖరీఫ్ సీజన్లో లో అధిక వర్షాల కారణంగా వరి పండించే అన్నదాతలు పంట నష్ట పోయారు. ఆ సీజన్లో జిల్లాలో లక్షా రెండు వేల 140 మంది రైతులు.. లక్షా యాభై వేల ఎకరాల్లో పంట నష్ట పోయారు. అప్పట్లో అధికారులు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మేరకు నష్టపోయిన రైతులకు 169 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు.
అన్నదాతల ఖాతాల్లోకి 169 కోట్ల పంట నష్టం సొమ్ము - Kharif season crop loss amount to farmers of West Godavari district
ఖరీఫ్ సీజన్-2020లో నష్టపోయిన పశ్చిమగోదావరి జిల్లా రైతులకు డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద పరిహారం లభించనుంది. ఈ మేరకు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమకానుంది.
![అన్నదాతల ఖాతాల్లోకి 169 కోట్ల పంట నష్టం సొమ్ము బీమా సొమ్ము](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:24:09:1621911249-ap-tpg-11-25-rs169-crores-crop-insurance-ap10092-25052021074808-2505f-1621909088-944.jpg)
bheema amount