పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ.. తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు రైతు సంఘాల నాయకులతో కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని దిల్లీలో కలిశారు. పోలవరంలో రైతులు పడుతున్న బాధలను, కష్టాలను ఉపరాష్ట్రపతికి వివరించి.. రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం అంతా కోల్పోయి వీధినపడ్డ పోలవరం నిర్వాసితులకు ఆదివాసీల సంఘాలకు పునరావాసం కల్పించేలా సూచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి: