రబీలో నీటి తడులు అందక పశ్చిమగోదావరి జిల్లాలో వరిపొలాలు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రలుచాచి..దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. గోదావరిలో నానాటికీ పడిపోతున్న నీటిమట్టాలతో పంట పొలాలు తడారిపోయాయి. ఎగువ తూములు రాత్రికి రాత్రే ఎత్తేయటం వల్ల..దిగువకు నీరు రావటం లేదు. శివారు కాలువలకు వచ్చేసరికి కాలువల్లో నీరు కనిపించటం లేదు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈసారి రబీసాగు చేపట్టారు. మెుత్తం 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దీంతో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
వంతుల వారీగా విడుదల
గోదావరిలో నీటిమట్టం తగ్గటంతో కాలువలకు నీటి పంపిణీ తగ్గించారు. వంతులవారి విధానం అమలు చేపట్టారు. పశ్చిమగోదావరి డెల్టాకు ప్రస్తుతం 3,840 వేల క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తున్నారు. ఇందులో ఏలూరు కాలువకు 618, జీవీ కాలువకు 450 క్యూసెక్కులు, నరసాపురం 1312, ఉండి 937, అత్తిలి 239 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆయా కాలువలకు వంతుల వారీగా విడుదల చేస్తున్న నీరు.. శివారు భూములకు చేరటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి వంతుగా 2.29 లక్షల ఎకరాలకు, రెండో వంతుగా 2.22 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. ప్రధాన కాలువలకు నీటి విడుదల చేసి..ఉప కాలువలకు వంతుల విధానం అమలు చేస్తున్నారు.
అధికారుల అక్రమాలు..