పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎమ్.నాగులపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో... రైతులు ధర్నా చేపట్టారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ... గ్రామ సచివాలయం వద్ద బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలంటూ నినాదాలు చేశారు.
'మా పంటలను ప్రభుత్వమే కొనాలి' - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎమ్.నాగులపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
మా పంటలను ప్రభుత్వమే కొనాలి.
ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు మాట్లాడుతూ... కరోనా విపత్తు, లాక్ డౌన్ వలన పంటలు అమ్ముడుపోక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి... రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి