ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎకరాకు రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ అన్నదాతల ఆందోళన - జంగారెడ్డిగూడెంలో రైతుల ధర్నా

గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎకరాకు రూ. 40 లక్షలు ఇవ్వాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

farmers dharna in jangareddygudem west godavari district
జంగారెడ్డిగూడెంలో రైతుల ఆందోళన

By

Published : Aug 12, 2020, 9:10 AM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పంగిడిగూడెం, పేరంపేట అన్నదాతలు ధర్నాకు దిగారు.

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ధర ఇస్తున్నారని, రైతులందరినీ సమానంగా చూడాలన్నారు. ఎకరాకు రూ. 40 లక్షలు ఇస్తే ఆందోళన విరమిస్తామని తెలిపారు. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట, రాజవరంలో ఇదే అంశంపై నిరసన దీక్షలు సాగాయి.

ABOUT THE AUTHOR

...view details