దొండకు ఎలాంటి గిట్టుబాటు ధర లేదని.. తీవ్రంగా నష్టపోతున్నామని ఏలూరు కలెక్టరేట్ ఎదుట రైతులు వాపోయారు. కొవిడ్-19 వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో దొండ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆదుకోవాలని నినాదాలు చేశారు. పందిరి సేద్యానికి చీడపీడలు ఆశిస్తున్నా.. అధికారులు ఎలాంటి సూచనలు, సలహాలు అందించడం లేదని రైతులు తెలిపారు. పందిరి సేద్యానికి ఖర్చు చేసిన రాయితీలు అందించి.. దొండ రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
'పందిరి సైద్యం రైతుల సమస్యలు పరిష్కరించాలి' - తూర్పు గోదావరిలో రైతుల ఆందోళనలు న్యూస్
పందిరి సేద్యం రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో దొండ రైతులు ఆందోళన చేపట్టారు.
!['పందిరి సైద్యం రైతుల సమస్యలు పరిష్కరించాలి' farmers agitation infront of eluru collectarate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8637903-1108-8637903-1598964388209.jpg)
farmers agitation infront of eluru collectarate