పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం శ్రీనివాసపురంలో రైతు రత్నరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు. సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు ఇళ్ల స్థలాల కోసం బలవంతంగా లాక్కున్నారని బాధితుడి తరుపు బంధువులు ఆరోపించారు. తనకున్న అరెకరం భూమి తీసుకుంటే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని రత్నరాజు ప్రశ్నించాడు. స్థానిక నాయకులు కావాలనే తన భూమిని తీసుకోవాలని అధికారులను ప్రోత్సహించారని ఆరోపించాడు. ఈ క్రమంలో మనస్థాపం చెంది గుళికలు తాగినట్లు తెలిపాడు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం క్రాంతి ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.
భూమి లాక్కున్నారని.. రైతు ఆత్మహత్యాయత్నం
సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు ఇళ్ల స్థలాల కోసం బలవంతంగా లాక్కొవడంతో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన రత్నరాజు.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు ఆత్మహత్య