పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ రావు చౌదరి శత జయంతి సందర్భంగా తణుకు కన్జ్యూమర్ కోపరేటివ్ స్టోర్స్ విత్తన శుద్ధి కర్మాగారం ఆవరణంలో ఏర్పాటు చేసిన నారాయణ రావు చౌదరి విగ్రహాన్ని ఆంధ్రా షుగర్స్ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ నరేంద్ర చౌదరి ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు పాల్గొని యలమర్తికి నివాళులర్పించారు.
'తణుకులో యలమర్తి నారాయణ రావు చౌదరి విగ్రహ ఆవిష్కరణ' - famous industrialist Yalamarthi Narayana Rao news
ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత యలమర్తి నారాయణ రావు చౌదరి శత జయంతి సందర్భంగా తణుకులో ఆయన విగ్రహాన్ని ఆంధ్ర షుగర్స్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర చౌదరి ఆవిష్కరించారు. విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, బాణాసంచా అమ్మకాల విషయంలో నారాయణ రావు ఎనలేని కృషి చేశారన్నారు
'తణుకులో యలమర్తి నారాయణ రావు చౌదరి విగ్రహ ఆవిష్కరణ'
కన్జ్యూమర్ కోపరేటివ్ స్టోర్స్ అధ్యక్షునిగా యలమర్తి నారాయణ రావు చౌదరి సేవలు అనితరసాధ్యమని మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అన్నారు. విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, బాణాసంచా అమ్మకాల విషయంలో నారాయణరావు ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి