పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లిలో కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దేవరాపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు.. కుటుంబ కలహాలతో పోలవరం కాలువలో దూకేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న బంధువులు 100కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసు కంట్రోల్ రూం సిబ్బంది... విషయాన్ని దేవరాపల్లి పోలీసులకు చేరవేశారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం.. భగ్నం చేసిన పోలీసులు - కలహాలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.
కలహాలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు.. సినీ తరహాలో కుటుంబ యాజమాని సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేశారు. కుటుంబ సభ్యులు పోలవరం కుడి కాలువ వద్ద ఉన్నట్లు ఎస్సై స్వామి గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకొని వారి ఆత్మహత్యయత్నాన్ని భగ్నం చేశారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించి... బంధువులకు అప్పగించారు.