పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో తన ఇద్దరు బిడ్డలతో గోదావరిలో దూకి సాయిలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహిళను గమనించిన స్థానికులు సాయిలక్ష్మి, ఆమె పెద్ద కూతురు లాస్యను రక్షించారు. పది నెలల చిన్న కూతురు దర్శిని గోదావరిలో గల్లంతైంది. పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇద్దరు చిన్నారులతో గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం - ఇద్దరు చిన్నారులతో గోదావరి దూకిన మహిళ
భర్త మరణం, అత్తంటి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు చిన్నారులతో ఓ మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల అప్రమత్తమై తల్లి, పెద్ద కూతురును కాపాడారు. ఈ ఘటనపై మరో చిన్నారి గల్లత్తైంది. పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
కొవ్వూరులోని అచ్చమ్మ కాలనీకి చెందిన సాయిలక్ష్మి భర్త ప్రసాద్ ఐదు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆమె...ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయని, ఇది భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు సాయిలక్ష్మి చెప్పారు.
ఇదీ చదవండి'కార్పొరేట్ స్కూళ్లకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి'