దొంగనోట్ల కేసులో ఇద్దరు అరెస్ట్ - పశ్చిమగోదావరిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్
దొంగనోట్ల కేసులో తణుకు పోలీసులు ఇద్దరని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2వేల రూపాయిల దొంగనోట్లు 5, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరంగి గ్రామానికి చెందిన ముజిబుర్ రెహ్మాన్, విశాఖకు చెందిన అబ్దుల్గా గుర్తించారు. వీరిద్దరు పెరవరి కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
దొంగనోట్ల కేసులో ఇద్దరు అరెస్ట్