ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తస్మాత్​ జాగ్రత్త: గ్రామ వాలంటీర్లమంటూ.. దోచేశారు! - ap latest

గ్రామ వాలంటీర్లమంటూ వచ్చారు. వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వేలిముద్రలు తీసుకున్నారు. తీరా చూస్తే వేలకు వేల రూపాయలు మాయమయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పొంగటూరులో కలకలం రేపింది.

fake grama volunteers stolen the digital money

By

Published : Aug 20, 2019, 9:46 PM IST

గ్రామ వాలంటీర్లంటూ..!

గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. వేలి ముద్రలు, బ్యాంకు ఖాతా నంబరు రాబట్టారు. సవివరంగా చెప్పక పోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని బెదిరించారు. అమాయక ప్రజలు ఆ వలలో చిక్కారు. మొబైల్​కు వచ్చిన సంక్షిప్త సందేశం చూసి షాకయ్యారు. తీరా చూస్తే.. వారి అకౌంట్​లోంచి నగదు మాయమైంది. లబోదిబో మంటూ బ్యాంకుకెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు డ్రా చేశారంటూ సిబ్బంది తెలిపారు. ఇలా నకిలీ గ్రామ వాలంటీర్లు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామస్థుల డబ్బు కొట్టేశారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందుకే... ప్రజలారా..! తస్మాస్​ జాగ్రత్త..!! ఇలాంటి కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details