Fitness Certificates Issue: వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో మరోమారు రవాణాశాఖలో ఆన్లైన్లో అక్రమాలు చోటు చేసున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ జారీ చేసినట్టుగా.. వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ అయిపోయాయి. ఈ వ్యవహారంలో ఆ అధికారి లాగిన్ ఐడీని వినియోగించి మూడు వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లను జారీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. రవాణాశాఖకు డేటా బేస్ సేవలు అందిస్తున్న వోటీఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన విశ్వనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఈ అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది.
రవాణాశాఖ ఆన్లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు.. - వాణాశాఖ ఆన్లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు
Fake Fitness Certificates: రాష్ట్ర రవాణాశాఖ ఆన్లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు వెలుగుచూశాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిధిలో వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాణాశాఖ ఆన్లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు
అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో ఇతర సేవలకు ఇబ్బంది లేదని రవాణాశాఖ స్పష్టం చేసింది. గతంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలను ఏపీలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు కొనసాగుతోంది. దానిపై విచారణ జరుతుండగానే మరోమారు అక్రమాలు వెలుగుచూడటం కలకలం రేపింది.
ఇదీ చదవండి:యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం..
TAGGED:
రావులపాలెం ఆర్టీఏ